కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాగజ్నగర్ డీఎస్పీ సుధీంద్ర హాజరై స్థానికులకు గణపతి ప్రతిమలను అందించారు. సంఘం ప్రతినిధులు డీఎస్పీ సుధీంద్రను శాలువాతో సన్మానించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని డీఎస్పీ సూచించారు.
ఇదీ చదవండిః కోకోనట్ గణేశ్... ఈ వినాయకుడు ఎంతో ప్రత్యేకం!