లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు.. కాగజ్ నగర్ యూనిటీ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. కుమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు పలు గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేసి తమ ఔదార్యం చాటుకుంటున్నారు.
విజయ బస్తీలోని పేదలకు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, వివిధ మతాల పెద్దల చేతుల మీదుగా సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికి.. ప్రజల మంచి కోసమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష