ETV Bharat / state

వైద్యుల్లేక విలవిల.. రోగుల్లేక వెలవెల... - sirpur t

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీ జిల్లాల్లో సర్కారు వైద్య సేవలు అంపశయ్యపై ఉన్నాయి. ప్రాథమిక వైద్యం ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. నియోజకవర్గ ప్రజల అవసరాలకోసం నెలకొల్పిన దవాఖానాలు రోగులులేక వెలవెలబోతున్నతీరు.. వైద్యసేవలకు దర్పణం పడుతోంది. జేబులో కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రి తలుపుతట్టడం.. లేదంటే ప్రాణాలపై ఆశలు వదిలేసి దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

వైద్యుల్లేక విలవిల.. రోగుల్లేక వెలవెల...
author img

By

Published : Jul 19, 2019, 11:55 PM IST

Updated : Jul 20, 2019, 7:01 PM IST

వైద్యుల్లేక విలవిల.. రోగుల్లేక వెలవెల...

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీల్లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నెలకొల్పిన సర్కారు ఆస్పత్రులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్​ టీ మండలాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎన్​ఎంలే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవాలి.

వైద్యులే లేరు

14 మంది వైద్యులుండాల్సిన ఈ ఆస్పత్రిలో సూపరింటెండెంట్​ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అతను కూడా నిత్యం కాగజ్​నగర్​ నుంచి వచ్చిపోతుంటాడు. వైద్యాధికారుల నియామకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరుతో దవాఖానాలు నిరుపయోగంగా మారాయి. కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం, లేదంటే దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు స్థానికులు.

నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి ఇదే అవడం వల్ల నిత్యం వందలాది మంది వస్తుంటారు. వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు, ఏఎన్​ఎంలు వైద్య పరీక్షలు చేసి ఇతర పట్టణాల్లో ఆస్పత్రులకు రిఫర్​ చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రజలు కాగజ్​నగర్​కు, మంచిర్యాలకు వెళ్తున్నారు.

అవసరాలను సొమ్ముచేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

అమాయక ప్రజల అవసరాలను కార్పొరేట్​ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అందినకాడికి దోచుకుని జేబులు గుళ్ల చేస్తున్నాయి. చిన్న చిన్న జబ్బులకు కూడా వేలకు వేలు బిల్లులు వేసి ముక్కుపిండి వసూలుచేస్తున్నాయి. జబ్బు కంటే డాక్టరు బిల్లుకే ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

నియోజకవర్గాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పుకొస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వైద్యంపై శీతకన్ను వేశారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: సమాజ సేవకుడిగా.... అభాగ్యులకు అండగా..

Intro:filename:

tg_adb_25_19_vaidhyam_cheyani_prabutva_asupatri_pkg_c11

Body:filename:

tg_adb_25_19_vaidhyam_cheyani_prabutva_asupatri_pkg_c11

()ఏజెన్సీ జిల్లాలో సర్కారీ వైద్య సేవలు అంపశయ్యపై ఉన్నాయి. ప్రాథమిక వైద్యం ప్రజలకు అందకుండా పోతోంది. నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన సామాజిక ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో రోగులకు అందుతున్న వైద్యసేవలు తీరుకు దర్పణం పడుతోంది. జేబు నిండుగా ఉంటేనే ప్రైవేటులో వైద్య సేవలు అందుతుండగా.. నిరుపేదలు మాత్రం దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

VO...01
బెజ్జూరు, కౌటాల, సిర్పూర్ టీ మండలాల ప్రజలకు వైద్య సేవలు చేయడానికి ఏర్పాటు చేసిన సామాజిక ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏ ఎన్ ఎం లే రోగులకు పరీక్షలు చేసి మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత గత ఏడాదిగా కొనసాగుతోంది. 14 మంది వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక సూపరింటెండెంట్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్ కూడా కాగజ్ నగర్ పట్టణంలో ఉంటూ రాకపోకలు చేస్తుంటాడు. వైద్యుల నియామకంపై పట్టించుకునే ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. . వందలాది గ్రామాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు డిప్యూటేషన్పై విధులు అప్పగించిన ఈ ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి విముఖత వ్యక్తపరుస్తూ ఆసుపత్రికి రావడం లేదు.

VO...02
నియోజకవర్గం అతిపెద్ద పెద్ద ఆసుపత్రి ఇదే కావడంతో చుట్టూ పక్క మండలాల గ్రామాల ప్రజలు సమస్య చిన్నదైనా పెద్దదైన ఇక్కడికే వస్తారు. సమయానికి ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో నర్సులు రోగులకు పరీక్ష చేసి ఇతర పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫెర్ చేస్తారు. దాంతో ఏం చేయాలో తెలియని అమాయక ప్రజలు దగ్గరలోని కాగజ్ నగర్ పట్టణం గాని మంచిర్యాలకి గాని తీసుకెళ్తారు. అక్కడకూడా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు ఉంటారో లేదో అని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న ప్రజలకు జేబులు గుల్లలవుతున్నాయి. చిన్న చిన్న జబ్బులకు సైతం వేలకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

అభివృద్ధిలో దూసుకుపోతున్నామని పదేపదే చెపుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో మాత్రం దృష్టి సరించడంలేదని ప్రజలు వాపోతున్నారు...

బైట్: స్థానికులు
01) శంకర్
02) మానస
03) చౌదరి సుజాత
04) తాజ్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
Last Updated : Jul 20, 2019, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.