కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ అనే కాంట్రాక్టు కార్మికుడు తీవ్ర అస్వస్వస్థకు గురయ్యాడు. తక్షణమే స్పందించిన పరిశ్రమ ప్రతినిధులు విజయ్‌కుమార్‌ను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయ్ మృతికి ఎస్పీఎం యాజమాన్యం కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి తోటి కార్మికులు, పలువురు రాజకీయ నాయకులు మద్దతు పలికారు. పరిశ్రమలో కార్మికులకు కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఎస్పీఎం యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
కాగజ్‌నగర్ తహసీల్దార్ ప్రమోద్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:- దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్