లాక్డౌన్ అమలులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కుమురం భీం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్(టి), చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల మీదుగా మహారాష్ట్ర వాసులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలోనూ వివిధ కారణాలతో వారు తెలంగాణకు వస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టి) మండలంలోని మాకిడి, జక్కాపూర్, వెంకట్రావ్ పేట్, పోడ్సా, చింతలమానేపల్లి మండల కేంద్రంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా వైద్యం కోసం వస్తే అన్ని ఆధారాలు పరిశీలించాకే అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు, మెడికల్, అత్యవసర సేవలు మినహా అకారణంగా వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'