కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులకు పట్టణ పురపాలక కమిషనర్ రవికృష్ణ జరిమానా విధించారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా నడుపుతున్న సిమెంట్ దుకాణానికి రూ.5000 జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా లారీ నుంచి సిమెంట్ దిగుమతి చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కమిషనర్ రవికృష్ణ విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా