కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని ప్రయోగశాలను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. విద్యార్థులకు అభ్యసన దీపికలు అందజేశారు. విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు అభ్యసన దీపికలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ హనుమంతు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పాణిని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: ఆ గ్రామంలో మద్యం అంటే ఛీ... ఛీ...