కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పట్టణ ప్రగతి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాల్వల్లో వెంటనే చెత్తచెదారం తొలగించాలని ఆదేశించారు.
పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. రోడ్లపై వ్యర్థాలు వేయొద్దని ప్రజలకు సూచించారు. పింఛన్ రావడం లేదని పులువురు వృద్ధులు ఫిర్యాదు చేయగా... సమస్య పరిష్కరించాలని కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ సద్దాం, కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పార్లమెంట్లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే?