కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఎంపీ సోయం బాపురావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నియంత్రిత వ్యవసాయ విధానం పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం 50 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసి 8రోజుల్లోనే డబ్బులను చెల్లించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే పంటలకు సరిగా డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు జేబి. పౌడెల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.