ETV Bharat / state

దొరికిన దొంగ

author img

By

Published : Mar 8, 2019, 12:06 AM IST

వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అసిఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల మొత్తం ఖరీదు లక్షా నలభై ఐదు వేల రూపాయలుగా ఉండవచ్చునని గుర్తించారు.

దొంగ అరెస్టు...5 బైక్​లు స్వాధీనం
దొంగ అరెస్టు...5 బైక్​లు స్వాధీనం
అసిఫాబాద్​ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న సాగర్ సర్కార్ అనే వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీ సమయంలో సరైన పత్రాలు చూపించకపోవటంతో అనుమానం వచ్చి విచారించారు. పోలీసుల నిలదీతకు దొంగతనం చేశానట్లు ఒప్పుకున్నాడు. కాగజ్​నగర్​ మండలం ఈజ్​గ్రామ్​కు చెందిన సాగర్​ అంతకుముందు చోరీ చేసిన నాలుగు బైక్​ల వివరాలను కూడా తెలియజేశాడు. వాటి విలువ లక్షా నలభై ఐదువేలకు పైగా ఉండొచ్చని స్థానిక సీఐ మల్లయ్య తెలిపారు.సాగర్​పై బెల్లంపల్లి, ఎన్టీపీసీ రామగుడం, మంచిర్యాల పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:3 లారీలు ఓ డీసీఎం​ ఢీ

దొంగ అరెస్టు...5 బైక్​లు స్వాధీనం
అసిఫాబాద్​ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న సాగర్ సర్కార్ అనే వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీ సమయంలో సరైన పత్రాలు చూపించకపోవటంతో అనుమానం వచ్చి విచారించారు. పోలీసుల నిలదీతకు దొంగతనం చేశానట్లు ఒప్పుకున్నాడు. కాగజ్​నగర్​ మండలం ఈజ్​గ్రామ్​కు చెందిన సాగర్​ అంతకుముందు చోరీ చేసిన నాలుగు బైక్​ల వివరాలను కూడా తెలియజేశాడు. వాటి విలువ లక్షా నలభై ఐదువేలకు పైగా ఉండొచ్చని స్థానిక సీఐ మల్లయ్య తెలిపారు.సాగర్​పై బెల్లంపల్లి, ఎన్టీపీసీ రామగుడం, మంచిర్యాల పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:3 లారీలు ఓ డీసీఎం​ ఢీ

Intro:filename:

tg_adb_02_07_marina_manushulu_pkg_c11


Body:ఫైల్ నేమ్:

tg_adb_02_07_marina_manushulu_pkg_c11

**************************************************


()ఒకప్పుడు కలప అక్రమ రవాణా కు ఆ ప్రాంతం పెట్టింది పేరు..
అక్రమంగా టేకు కలప కొనుగోలు చేసి వాటితో ఫర్నిచర్ తయారుచేసి అమ్ముకోవడం... ఎప్పుడైనా అధికారులు సోదాలు చేపడితే ఉన్నదంతా నష్టపోవడం గత నలభై సంవత్సరాలుగా ఇదే తంతు..
అయితే వారిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇక ముందు తాము అక్రమ కలప రవాణా కు పాల్పడబోమని.. ఎవరైనా అలా చేస్తే తామే పట్టిస్తామని అటవీశాఖ అధికారులకు స్వచ్చందంగా హామీ పత్రం రాసి ఇచ్చారు..


VO...01
కుమురంభీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడ కోయ వాగు గ్రామంలో సుమారు 500 మంది కలప ఫర్నిచర్ తయారీయే జీవనాధారంగా జీవిస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్సిల్క్ పరిశ్రమ మూతపడటంతో ఉపాధి కోల్పోయిన స్థానికులు సమీప అటవీ ప్రాంతం నుండి టేకు కలపను తీసుకువచ్చి మంచాలు, కుర్చీలు, మెజా బల్లలు లాంటివి తయారు చేసి అమ్మడం జీవనోపాధిగా మలుచుకున్నారు. సమీప అటవీ ప్రాంతంలో కలప తగ్గిపోవడంతో మహారాష్ట్ర సరిహద్దు లోని కలప స్మగ్లర్ల నుండి టేకు కలప కొనుగోలు చేసి దొంగచాటుగా వ్యాపారం చేసేవారు..


VO...02
ఎంత జాగ్రత్తగా వ్యాపారం చేసినా ఎప్పుడో ఒకసారి అధికారుల సోదాలు బయటపడటం అధికారులు కలపను సీజ్ చేసి పైగా కేసులు కూడా నమోదు చేయడం వారిని తీవ్రంగా కలిచివేసింది. సంవత్సరాలు కష్ట పడిన శ్రమ ఒక్కసారిగా బూడిద పాలు కావడంతో వారు ఆలోచనలో పడ్డారు. జీవనాధారమైన వృత్తిని వదులుకోలేక చట్ట వ్యతిరేకమైన పని చేస్తూ నష్టాల బారిన పడుతుండటంతో తర్జనభర్జన అయ్యారు.

VO...03
ఇటీవల కాగజ్నగర్ డివిజన్ కి కొత్తగా వచ్చిన అటవీశాఖ అధికారి రాజా రమణారెడ్డి కలప అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేసిన ప్రతిసారి లక్షల విలువచేసే టేకు కలప స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారితో చర్చలు జరిపారు. అక్రమంగా కలప వ్యాపారం చేయడం వల్ల కలుగుతున్న నష్టాన్ని వారికి వివరించారు. ఒకవైపు అడవులు అంతరించి పోతుంటే మరోవైపు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లుతుందని వారికి తెలిపారు. చట్టపరంగా టేకు కలప కొనుగోలు చేసి వ్యాపారం ఎలా చేసుకోవచ్చో వారికి తెలియజేశాడు.
మరోవైపు అడవుల సంరక్షణకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి నిత్యం కాస్తూ.. రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు.


VO...04
ఇన్ని సంవత్సరాలుగా తాము కలప వ్యాపారం చేస్తున్నా.. అధికారులు అడపాదడపా సోదాలు చేయడం.. కలప స్వాధీనం చేసుకొని కేసులు పెట్టడం జరిగేదని.. కానీ కొత్తగా వచ్చిన అధికారి రాజా రమణారెడ్డి తమ బాధలను గుర్తించి తాము చట్టపరంగా కలప వ్యాపారం చేసుకునేందుకు దారి చూపెట్టాడని.. ఆ అధికారి వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


బైట్స్:
01) కాగజ్ నగర్ ఎఫ్డిఓ: రాజా రమణ రెడ్డి

కలప వ్యాపారులు
02) సాదిక్
03) అబిద్ అలీ
04) ఫరిద్
05) ఫారెస్ట్ వాచర్: కే. సుధాకర్

గమనిక: ఈ కథనానికి సంబంధించిన మరొక విజువల్ సేమ్ ఫైల్ నేమ్ తో ఈటీవీ ఎఫ్టిపి లో పంపడమైనది. తీసుకోగలరు.



Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 651
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.