వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి ఆరోపించారు. రైతును రాజును చేసేందుకు మోదీ నూతన చట్టాలను ప్రవేశ పెట్టారని అన్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా ఆధ్వర్యంలో నూతన సాగుచట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.. సాగుచట్టాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు వాటిలో ఉన్న తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. కిసాన్ సమ్మాన్ నిధి వర్చువల్ సమావేశాన్ని ఆన్లైన్లో వీక్షించారు.
- ఇదీ చదవండి: 'కవితను అలా అంటారా?..' అర్వింద్ వ్యాఖ్యలపై నిరసన