ETV Bharat / state

పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి అధికారుల భరోసా - tiger attacked and killed Nirmala

కుమురం భీం జిల్లా కొండపల్లిలో పులి దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్​తో సహా పలువురు అధికారులు పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. కొండపల్లి అటవీప్రాంతంలో అధికారులు పర్యటించి.. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు.

authorities-visit-the-girl-family-of-died-in-a-tiger-attack-komaram-bheem-district
పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి అధికారుల భరోసా
author img

By

Published : Nov 30, 2020, 5:10 PM IST

పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబానికి అధికారుల భరోసా

కుమురంభీం జిల్లాలో పులి దాడిలో మృతి చెందిన బాలిక నిర్మల కుటుంబ సభ్యులను అధికారులు పరామర్శించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. పులి దాడి ఘటన వివరాల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్నివిధాల ఆదుకుంటామని బాలిక కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అనంతరం అధికారులు కొండపల్లి అటవీ ప్రాంతంలోని ఘటనా స్థలిని పరిశీలించారు.

20 రోజుల వ్యవధిలో పులు దాడుల్లో ఇద్దరు మృత్యువాత పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిర్మలను హతమార్చిన పులిని గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అటు అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందంటూ స్థానికులు ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఆ జిల్లాలో పులి దాడిలో మరొకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.