కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మసీదులన్నీ రంజాన్ పర్వదినాన కూడా వెలవెలబోయాయి. కొంతమంది మతపెద్దల సమక్షంలోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. మిగతా వారంతా తమతమ ఇళ్లలోనే ప్రార్థనలు చేశారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మసీదులో కేవలం ఐదుగురితో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా సహా అన్ని మసీదుల వద్ద జనం గుమికూడకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
ఇవీ చదవండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్