ETV Bharat / state

సిర్పూర్ పేపర్​​ మిల్లులో ఏం జరుగుతోంది? - sirpur

కొన్నేళ్ల క్రితం మూతపడి... మళ్లీ తెరుచుకున్న సిర్పూర్ కాగజ్‌నగర్‌ పేపర్ మిల్లులో కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు అంతంత మాత్రమే!. ఈక్రమంలో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం స్పందిస్తున్న తీరు పలు సందేహాలకు తావిస్తోంది!

accidents in sirpur paper mill in kumurabheem asifabad district
సిర్పూర్ పేపర్​​ మిల్లులో ఏ జరుగుతోంది?
author img

By

Published : Mar 2, 2020, 7:59 AM IST

Updated : Mar 2, 2020, 12:14 PM IST

సిర్పూర్ పేపర్​​ మిల్లులో ఏ జరుగుతోంది?

సిర్పూర్‌ పేపర్​ మిల్లును కార్మికుల భవిష్యత్తు, స్థానికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆగస్టు 2, 2018న ప్రభుత్వం పునః ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 900 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల బాయిలర్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. మిల్లు పునరుద్ధరణలో భాగంగా జేకే యాజమాన్యం అతి పురాతన యంత్రాలను నవీకరిస్తోంది. మిల్లు పునరుద్ధరణలో అతి పురాతన యంత్రాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు.

బీమా సదుపాయాలు అందలేదు..

గతేడాది అక్టోబర్ 14న మిల్లులో భారీ పేలుడు కలకలం రేపింది. అప్పటి ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు ఈఎస్​ఐ కార్డులు లేకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రిలో యాజమాన్యం చికిత్సలు అందిస్తోంది. నేటికి ఏలాంటి బీమా సదుపాయాలేవీ అందలేదని బాధితులు వాపోతున్నారు.

మిల్లులో ఏం జరుగుతోంది?

ప్రమాద ఘటనపై విచారణ చేపట్టి వివరాలు వెల్లడించాలి. అందుకు విరుద్ధంగా ప్రమాద విషయాన్ని గోప్యంగా ఉంచడం, ఘటనా స్థలికి ఎవరినీ అనుమతించకపోవడం, క్షతగాత్రులను, మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా తరలించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇటు యాజమాన్యం, ఆటు గుత్తేదారు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో, తదితర విషయాలపై ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ప్రకటన జారీ చేయక పోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చూడండి: కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి

Last Updated : Mar 2, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.