కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం లోనవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. తలసేమియా వ్యాధితో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. జనార్దన్, లావణ్య దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె యశస్వి... కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పదిరోజులు కిందట జ్వరం రావటం వల్ల కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే యశస్వి ఈరోజు కన్నుమూసింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు మృతి చెందటం వల్ల తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చూడండి : యూట్యూబ్‌లో మాతృభాషకే వీక్షకుల జై!