ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి - asifabad news

తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన కుమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్​లో చోటుచేసుకుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడు చెరువులో విగతజీవిగా తేలటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

5 years boy died due to drown in pond
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి
author img

By

Published : Jul 12, 2020, 11:32 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం తిరుపతి, గీత దంపతులకు మహేశ్​(7), దినేశ్​​(5) ఇద్దరు కుమారులు.. మరో ఇద్దరు పిల్లలతో కలిసి చెరువు గట్టుకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో దినేశ్​​ జారి చెరువులో పడిపోయాడు. మహేష్ ఇంటికి వచ్చి తల్లి గీతకు సమాచారం ఇచ్చాడు. జాలరితో వెతికించగా దినేశ్​ నీటమునిగి అప్పటికే మృతి చెందాడు. తల్లి గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.