కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద సుమారు 20 వేల రూపాయల విలువైన మద్యం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రాకేష్, అవినాష్, సమీర్ అహ్మద్‌లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: 2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు