ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(YS SHARMILA) పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ల కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు అడిగి తెలుసుకున్న షర్మిల.. అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
నాగేశ్వరర రావు కుటుంబ సభ్యుల కష్టాలు విని చలించిపోయిన షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పెనుబల్లిలో షర్మిల నిరుద్యోగ(SHARMILA DEEKSHA) నిరాహార దీక్షకు దిగారు. ముందుగా వైఎస్సార్(YSR) విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నిరుద్యోగ దీక్షలో కూర్చున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా షర్మిల నిరసనకు దిగారు.
ఇదీ చదవండి: Koushik Reddy: తెరాస గూటికి కౌశిక్ రెడ్డి.. రేపే చేరిక