Brothers Need Help in Khammam : కడు పేదరికం. నిలువ నీడ లేదు. అమ్మానాన్నలు ఇరవై ఏళ్ల కిందటే మరణించారు. ఇద్దరు అన్నలూ దివ్యాంగులే. కళ్లు లేని వారొకరు, కాళ్లు లేని వారొకరు. ఇలాంటి స్థితిలోనూ వారి భారం తనపై వేసుకున్నాడు ఖమ్మం నగరానికి చెందిన కొణతం కిరణ్. అన్నలకు అన్నీ తానే అయి.. కూలి పనులు చేసి, వారిని సాకుతున్నాడు. కిరణ్ పెద్దన్న అమృతరావుకు పుట్టుకతోనే రెండు కాళ్లూ లేవు. రెండో సోదరుడు అనిల్ అంధుడు, మానసిక దివ్యాంగుడు. ఇద్దరిలో ఒకరికే పింఛను వస్తోంది.
ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ కుష్ఠు రోగుల కాలనీలో నివసించామని, ఇటీవల నగర శివారులోని అగ్రహారం కాలనీకి మారామని చెప్పాడు కిరణ్. సోదరులు ముగ్గురూ తమకు జీవనోపాధి, ఇల్లు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్, రేషన్‌కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం కలిగి అర్హత ఉన్నా తమకు సాయం అందడంలేదని వాపోతున్నారు.
ఈనాడు-ఈటీవీ భారత్‌లో వచ్చిన ఈ కథనాన్ని చూసిన స్థానిక వ్యక్తి ట్విటర్ ద్వారా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. అమ్మానాన్నలను కోల్పోయి.. ఇద్దరు అన్నలకు అన్నీ తానై అండగా నిలుస్తున్న ఓ తమ్ముడికి సాయం చేయాలంటూ ట్వీట్ చేశారు.
-
Request @Collector_KMM to assist asap https://t.co/ia6K8SgAMa
— KTR (@KTRTRS) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Request @Collector_KMM to assist asap https://t.co/ia6K8SgAMa
— KTR (@KTRTRS) February 24, 2022Request @Collector_KMM to assist asap https://t.co/ia6K8SgAMa
— KTR (@KTRTRS) February 24, 2022
ఈ ట్వీట్‌పై స్పందిన మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను ట్యాగ్ చేస్తూ.. వారికి అన్నిరకాలుగా సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలు తీసుకున్న కలెక్టర్ గౌతమ్.. వీలైనంత త్వరలో వాళ్లకు సాయం అందేలా చూస్తానని రీట్వీట్ చేశారు.
-
Noted, sir. Will do the needful.
— Collector Khammam (@Collector_KMM) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Noted, sir. Will do the needful.
— Collector Khammam (@Collector_KMM) February 24, 2022Noted, sir. Will do the needful.
— Collector Khammam (@Collector_KMM) February 24, 2022