కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన ఉయ్యాల రాజవీరుపై తన తమ్ముడు లస్మయ్య కత్తితో దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. రాజవీరు కొంత డబ్బును తన తమ్ముడికి అవసరాల కోసం ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ్ముడు లస్మయ్యను రాజవీరు డబ్బు అడిగాడు. డబ్బు అడిగాడన్న కోపంతో సొంత అన్న అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశాడు తమ్ముడు లస్మయ్య.
సమాచారం అందుకున్న ఎస్సై కిరణ్ రెడ్డి హుటాహుటీన గ్రామానికి చేరుకొన్నారు. బాధితుడితో మాట్లాడారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కి సమాచారం అందించగా.. అందుబాటులో లేదన్నారు. ఎస్సై తన వాహనంలో బాధితుడిని జమ్మికుంటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..