మద్యం గొలుసు దుకాణాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా మధిర ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలోని గ్రామాల్లో గొలుసుకట్టు మద్యం దుకాణాలు నిర్వహిస్తూ పేదల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు.
మద్యం దుకాణం నిర్వాహకులకు ఎక్సైజ్ అధికారులు అండగా నిలుస్తూ గొలుసుకట్టు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే గ్రామాల్లో ఉన్న గొలుసుకట్టు దుకాణాలు మూసి వేయించాలని... లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు శీలం నరసింహారావు, మంద సైదులు పాల్గొన్నారు.