54 రోజుల పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పనిచేసిన తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగులు ఖమ్మం కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు కలెక్టరును కలిసి వినతి పత్రం అందజేశారు. 54 రోజుల పాటు పనిచేసినందుకు గాను తమకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని... భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాలలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్- 'నిర్భయ' దోషుల కోసమేనా?