ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కురాకుల నాగభూషణంకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పదవి దక్కగా, ఓసీ వర్గానికి చెందిన రాయల శేషగిరిరావుకు డీసీఎంఎస్ అధ్యక్ష పదవి లభించింది.
పార్టీ అధిష్ఠానం ఆ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని మంత్రి అన్నారు. జిల్లా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి రెండు పదవులను ఏకగ్రీవంగా గెలిచారన్నారు. కొత్తగా ఎన్నికైన వారు రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తారని మంత్రి పువ్వాడ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : కష్టాలు తెచ్చిపెట్టిన డ్యాన్సులు.. కానిస్టేబుళ్లపై చర్యలు..