ఖమ్మం జిల్లా వైరా చైతన్య డిగ్రీ కళాశాలలో ఈటీవి భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా ఎస్సై సురేశ్ హాజరయ్యారు. యువత నిజాయితీగా ఓటువేయాలని, డబ్బులకు ప్రలోభ పడితే ఐదేళ్ల భవిష్యత్తు పాడవుతుందని సూచించారు.
ప్రలోభాలకు లోనై ఓటువేస్తే... సమస్యలున్నా ప్రశ్నించే గళాన్ని కోల్పోతామని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు, వాదనలకు వెళ్లరాదని పోలీసు కేసు నమోదైతే జీవితాలు పాడవుతాయని యువతకు తెలిపారు. ఓటు... పౌరుడి చేతిలో ఉన్న వజ్రాయుధం అని, అమూల్యమైన దాని విలువ తెలుసుకోవడంతో పాటు తోటి వారికి తమ గ్రామాల్లో వివరించాలన్నారు.