పల్లెల్లో కొవిడ్ మహమ్మారి చాపకిందనీరులా వ్యాపిస్తుంది. వైరస్ కట్టడికి ఎన్ని మార్గాలు పాటింటినా కేసులు వస్తూనే ఉన్నాయి. మందులేని వ్యాధికి చికిత్స కంటే నివారణే నయం అని గుర్తించిన గ్రామస్థులు మహమ్మారి కట్టడికి చేకులు కలిపారు. గ్రామంలో వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట పాలకవర్గం సభ్యులు కొవిడ్ కట్టడికి గ్రామంలో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖుల విగ్రహాలకు మాస్కులు వేశారు. గ్రామంలోని కూడళ్ల వద్ద జనం గుమిగూడి ముచ్చట్లు పెట్టకుండా... సిమెంట్ బల్లలను తిరగేసి పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద టీకా కార్యక్రమం జరుగుతుండటంతో... ప్రజలు ఒకేచోట చేరకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: కొవిడ్ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్