మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు అన్నారు. ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రవర్తించిన తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయం ఏడున్నరకే ప్రమాణ స్వీకారం చేయలేదని తెలిపారు. అక్కడ కచ్చితంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్నారు.
ఇవీ చూడండి: ఏడు మండలాల ఆస్తుల పంపకాలకు ఆమోదం