ఖమ్మం జిల్లా కల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సత్తుపల్లి నియోజకవర్గంలోని ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ దశరథ్కు వినతి పత్రం అందజేశారు. 14 సంవత్సరాలు ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహించిన తమకు లక్ష్యాలు పెట్టి... ఉద్యోగంలోంచి తొలగించే చర్యలు చేపడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం బాధకరమని జిల్లా అధ్యక్షుడు కర్రి సదానందం తెలిపారు.
ప్రభుత్వం విడుదల చేసిన 4779 జీవోతో ఖమ్మం జిల్లాలో ఉన్న 420 మంది ఫీల్డ్ అసిస్టెంట్లలో దాదాపు 300 మందిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాపోయారు. మూడు నెలలుగా ఉపాధి క్షేత్ర సహాయకులకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధనకు దశలవారీ ఆందోళనలో భాగంగా మార్చి 11న హైదరాబాద్‌లో మహాధర్నా, మార్చి 12 నుంచి విధులు బహిష్కరించి నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: గబ్బర్‌సింగ్ పెళ్లి సీన్ రిపీట్... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు