ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ బాటపట్టారు. డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన కార్మికులు... సరూర్ నగర్ వేదికగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా తరలివెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులంతా... ఛలో హైదరాబాద్ అంటూ నినదిస్తూ.. బహిరంగ సభకు పయనమయ్యారు. ప్రత్యేక ప్రైవేటు బస్సులు, వాహనాల్లో తరలివెళ్తున్న ఆర్టీసీ కార్మికులు... రెండు నెలల నుంచి జీతాలు లేకున్నా... బహిరంగ సభ కోసం అయ్యే ఖర్చుల్ని భరించి మరీ సమరభేరీ సభకు వెళ్తున్నారు. ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య