2018లో ఉత్తీర్ణులైన వారికి పోస్టింగులు ఇవ్వాలని టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ధర్నా చౌక్‌లో టీఆర్టీ అభ్యర్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూన్ ఒకటి లోపు తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని లేకుంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
'పోస్టింగ్‌లు ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం' - khammam
ఖమ్మంలో టీఆర్టీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎంపికైనా ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. వీరికి ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి.
టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన
2018లో ఉత్తీర్ణులైన వారికి పోస్టింగులు ఇవ్వాలని టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ధర్నా చౌక్‌లో టీఆర్టీ అభ్యర్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూన్ ఒకటి లోపు తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని లేకుంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
sample description