సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సాగిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ రైతులు, అధికారులతో కలిసి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో వీక్షించారు. పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. అక్టోబర్ 29న చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజని చెప్పారు.
ధరణి పోర్టల్ ప్రారంభంతో రైతులు ఇక నిబ్బరంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక భవిష్యత్‌లో ఏ రకమైన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అయినా.. తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ పద్ధతితో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...