రానున్న ఎన్నికలు అహంభావానికి.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే సంఘర్షణగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అభివర్ణించారు. ఆరేళ్లలో ఇచ్చిన హామీలన్నీవిస్మరించిన తెరాస.. అధికారం కోసం పనిచేస్తోందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో పర్యటించిన కోదండరాం.. తెజస జిల్లా పార్టీ కార్యాలయాన్నిప్రారంభించారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పతనమైపోయాయన్న కోదండరాం...పోరాటాలను ఎన్నికల ద్వారా అణిచివేయాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. ఎన్నికలను తెరాస పైసలాటగా మార్చిందని కోదండరాం విమర్శలు గుప్పించారు.
ఇవీ చూడండి: కాలయాపన ఆపండి... తక్షణమే సాయం అందించండి: సంజయ్