సుమారు 195 కి.మీ.. 18 గంటల కాలినడక.. ఎలాగైనా తమ సొంతిళ్లకు చేరాలన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి ప్రాంత భవన నిర్మాణ కార్మికుల కష్టానికి కొలమానాలివి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ముగ్గురు యువ కార్మికులు మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం చేరుకున్న దృశ్యమిది.
18 గంటల్లో... 195కి.మీ ప్రయాణం - Three workers from Odisha state travel 195 km in 18 hours
లాక్‌డౌన్ వారికి ఉపాధి లేకుండా చేసింది. వలసకూలీలను తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే విధంగా చేసింది. బతకలేని పరిస్థితుల్లో వారందరిదీ ఒకే బాట అయింది. తమ ఊరు చేరడమే లక్ష్యమైంది. కలో గంజో కుటుంబ సభ్యులతో కలిసే తాగుదామని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దారి పట్టారు.
18 గంటల్లో... 195కి.మీ ప్రయాణం