ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుగొండలోని కుంచాపర్తి మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల మూడో వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస సొసైటీ డిప్యూటీ కార్యదర్శి సీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా పుస్తక ప్రదర్శన, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
గురుకుల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే కాకుండా మానసికోల్లాసానికి క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలో చదివిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య