ETV Bharat / state

కరోనా కట్టడికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి: భట్టి - telangana latest news

నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొవిడ్​ కట్టడికి అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క
author img

By

Published : Jun 1, 2021, 10:12 AM IST

కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగమంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. వైరస్​ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు బోర్డులు ఏర్పాటు చేయాలని భట్టి పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో దోపిడీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా టీకాలను ముందుగా వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పరీక్షలు వీలైనంత పెంచాలని కోరారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Free Water : ఉచిత నీరన్నారు.. బిల్లుతో వాత పెడుతున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.