తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు అనారోగ్యంతో మరణించిన ఘటన... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి పంచాయతీ తవిసిబోడులో చోటుచేసుకుంది. భూక్య నాగేశ్వరరావు ఉద్యమ ఆకాంక్షను వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంచేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2009 నుంచి 14 వరకు వైరా ప్రాంతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమైక్య పాలకుల ప్రభుత్వాల ప్రతి ఘటనలను ఎదుర్కొంటూ ఉద్యమ ఆకాంక్షను బలంగా వినిపించారు. కాలం చిన్న చూపు చూడడంతో పక్షవాతంతో మంచాన పడ్డారు.
ఆర్థిక స్థోమత సరిగాలేని ఉద్యమనేత ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. ఎలాంటి సహాయం అందక అనారోగ్యంతో అస్తమించారు. దీంతో ఇతని భార్య, 15 ఏళ్ల కుమారడు కన్నీటి పర్వతం అయ్యారు. నాగేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, వైరా నియోజకవర్గ పలువురు నాయకులు కార్యకర్తలు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: కనీస మద్దతు ధరపై మోదీ హామీ