భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వేముగుంటలో 6 ఎకరాల భూ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీకి మంగళవారం రోజున హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ భూవివాదానికి సంబంధించి సివిల్ కోర్టులో ఉన్న కేసు వివరాలనూ సమర్పించాలని ఆదేశించింది.
తదుపరి విచారణను సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. సివిల్ వివాదంలో తన భర్త, మామలను పోలీసులు పిలిపించి వేధింపులకు గురిచేశారని, తలపై తుపాకీ పెట్టి ఆ భూమిలోకి వెళ్లకూడదని బెదిరించారని కొండూరు ఈశ్వరమ్మ రాసిన లేఖను గవర్నర్ తమిళిసై.. హైకోర్టుకు పంపారు. ఈ లేఖను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇదీ చదవండి: PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు