ETV Bharat / state

'నిరుద్యోగ యువత పోరాటాలకు సిద్ధం కావాలి' - డీవైఎఫ్ఐ

నిరుద్యోగ సమస్యలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు.

Democratic Youth Federation of India
నిరుద్యోగ యువత పోరాటాలకు సిద్ధం కావాలి
author img

By

Published : Dec 21, 2020, 11:00 AM IST

నిరుద్యోగ సమస్యలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి విజయ్ అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలో డీవైఎఫ్ఐ 20వ మహాసభను నిర్వహించారు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న తన ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు.

భాజపా ప్రభుత్వం చట్టాల పేరుతో రైతులను మోసం చేస్తోందని సామాజికవేత్త దేవి అన్నారు. రైతు ధర్నాకు అందరు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే చట్టాలను రద్దు చేయాలని దేవి డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముదిగొండ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.