సాంప్రదాయ, సాంస్కృతిక కళలకు మధిర ప్రాంతం పుట్టినిల్లు అని ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో శ్రీసీతారామాంజనేయ కళా పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించారు. మరుగున పడిపోతున్న సాంప్రదాయ కళలను పరిరక్షిస్తున్న రంగస్థల కళాకారులను నాగేశ్వరరావు ప్రశంసించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేసిన అనంతరం కందుకూరి వీరేశలింగం చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ ప్రసాద్, అధ్యక్ష కార్యదర్శులు గడ్డం సుబ్బారావు, గడ్డం శ్రీనివాస్, కళాకారులు కురిచేటి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదు : ఈటల