ETV Bharat / state

పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్​

అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ.. అన్ని ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ శ్రేణి పట్టణాలను తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు.

it minister ktr khammam tour
మంత్రి కేటీఆర్​ ఖమ్మం పర్యటన
author img

By

Published : Apr 2, 2021, 2:17 PM IST

భారతదేశ వృద్ధిరేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఖమ్మం పర్యటనలో భాగంగా.. రూ.30 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ రెండో దశకు మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వర్‌రావుతో కలిసి అంకురార్పణ చేశారు. హైద‌రాబాద్‌కు మాత్రమే ఐటీని ప‌రిమితం చేయకుండా.. ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కూ విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యువ‌త‌కు ఎక్కడికక్కడే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు సృష్టించాల‌నే ల‌క్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న మంత్రి.. టి-ఫైబ‌ర్ పూర్తైన తర్వాత ఇంటింటికీ బ్రాడ్ బాండ్ కనెక్షన్‌ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.

అనంతరం సీసీరోడ్లతో పాటు శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. తర్వాత టేకులపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్​ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 35 వేల నూతన కనెక్షన్లు, 85 వేల పాత కనెక్షన్లకు ప్రతి రోజూ మంచినీటి సరఫరాను మంత్రి ప్రారంభించారు.

అత్యాధునిక బస్టాండ్​కు శ్రీకారం..

ఈ సందర్భంగా రూ.25 కోట్లతో ప్రజా రవాణాకనుగుణంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్టాండ్‌ను మంత్రులతో కలిసి కేటీఆర్​ ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన మంత్రి.. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేంద్రం నుంచి సహకారంలేని పరిస్థితుల్లోనూ.. అభివృద్ధిలో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు.

మరికొన్ని..

అనంతరం.. కాల్వొడ్డులో నూతన వైకుంఠదామం ప్రారంభోత్సవానికి మంత్రులు హాజరయ్యారు. అక్కడి నుంచి తెరాస కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేటీఆర్​ పాల్గొన్నారు. అనంతరం సత్తుపల్లికి బయలుదేరనున్న మంత్రులు.. నూతన పురపాలక భవనంతో పాటు సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.