ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. రూ.25 కోట్లతో 30 ప్లాట్‌ఫాంలు, అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అంతకుముందు నగరంలో ఐటీ హబ్ రెండో టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగం లభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ.. ఆ రంగంలో దేశంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.
- ఇదీ చదవండి : ఖమ్మంలో కేటీఆర్.. ఐటీ హబ్ రెండో దశకు అంకురార్పణ