ఖమ్మం నగరం ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు.. తమ భవిష్యత్‌కు బంగారు బాట వేసిన గణితం మాస్టార్‌ను ఘనంగా సత్కరించారు. జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు వజ్రాల వెంకట్ రెడ్డిని విద్యార్థులంతా ఆయన ఇంటి నుంచి ఓపెన్ టాప్ జీపులో ఎక్కించుని.. నగర వీధుల్లో ఊరేగించారు.
దారి పొడవునా పూలు చల్లుతూ గురుదక్షిణ చెల్లించారు. వెంకట్ రెడ్డి కృషి వల్ల ఎంతో మంది విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. ఉన్నత స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన వద్ద చదువుకున్న వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉపాధ్యాయులు ఉండటం విశేషం.
- ఇదీ చూడండి : గురువుకు అందలం... నరేంద్రకు అరుదైన గౌరవం