కూసుమంచి కుసుమాలపై కన్నేసిన కీచకుడు ఖమ్మం జిల్లా కూసుమంచి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంకర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినిలు వాపోయారు. రోజురోజూకీ అతని ఆగడాలు మితిమీరిపోయాయి. వేధింపులు తట్టుకోలేని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పారు. ఉపాధ్యాయునిపై ఆగ్రహంతో ఊగిపోయిన వాళ్లు... పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే విధుల నుంచి తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిని తొలగించనిదే పాఠశాలకు వెళ్లమని విద్యార్థులు తెగేసి చెప్పారు.
పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్ ప్రాథమిక విచారణ చేశారు. విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులతో జిల్లా మహిళా అభివృద్ధి అధికారి ఉషశ్రీ , ఇద్దరు ఎంఈవోలు మాట్లాడారు. గతంలో పనిచేసిన పాఠశాలల్లోనూ ఇదే తరహా కేసులున్నట్లు గుర్తించారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు షీల్డ్కవరులో అందించారు.
పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు.