TDP will organize a huge public meeting: డిసెంబర్ 21న ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని ప్రశ్నించే వారికి ఖమ్మం సభ సమాధానం చెబుతుందన్న ఆయన లక్ష మంది కార్యకర్తలతో సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబుబాబాద్ జిల్లాల పార్లమెంటరీ కమిటీలు, ముఖ్య నాయకులు, డివిజన్ స్థాయి కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్, కూరపాటి వెంకటేశ్వర్లు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కనివినీ ఎరుగని రీతిలో జరుగనున్న బహిరంగసభ ద్వారా తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో మరోసారి సమావేశమైన ఖమ్మం బహిరంగసభ విధి విధానాలు, ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు కాసాని తెలిపారు.
ఇవీ చదవండి: