ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డు, తల్లాడ మండలంలోని సీసీఐ కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తనిఖీ నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో ప్రత్తి కొనుగోలు ప్రక్రియ, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయిస్తున్న రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, చెల్లింపులు ఐదు రోజుల్లోపే ఖాతాల్లో జమచేస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కేంద్రాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మార్కెట్ సిబ్బంది రైతులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వరంగల్ జేడీఎం మల్లేశం, ఖమ్మం ఏడీఎం సంతోష్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సంక్రాంతి కానుక... జనవరి 5 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు