ఖమ్మంలో కరోనా నివారణ చర్యలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీ తీసుకుంటున్నారు. ప్రజలను రోడ్లపైకి రాకుండా నిషేధం విధించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. ప్రధాన కూడళ్లలో ఫైర్ సిబ్బంది పిచికారి చేస్తుండగా... డ్రోన్ సాయంతో పలు వీధుల్లో రసాయనాలను చల్లుతున్నారు. నగరంలోని గాంధీచౌక్‌లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని డ్రోన్‌తో పిచికారి చేస్తున్నారు. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసే యంత్రాన్నే వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖమ్మం రోడ్లపై డ్రోన్‌తో రసాయన ద్రావణం పిచికారి - SPRAYING CHEMICALS BY USING DRONE IN KHAMMAM
ఖమ్మం జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కార్పొరేషన్ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. రసాయన ద్రావణం పిచికారి చేసేందుకు డ్రోన్‌ను వినియోగిస్తున్నారు.
![ఖమ్మం రోడ్లపై డ్రోన్‌తో రసాయన ద్రావణం పిచికారి ఖమ్మంలో రసాయన ద్రావణం పిచికారి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6723453-thumbnail-3x2-drone.jpg?imwidth=3840)