ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో డెంగీ జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కి తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగీ జ్వరంగా వైద్యులు గుర్తించారని బంధువులు తెలిపారు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ కొడుకు కళ్ల ముందు విగతజీవిగా మృతి చెందటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్