మహాశివరాత్రి పర్వదినాన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగాయి. స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్విహంచారు. కల్లూరు మండలం చెన్నూరులోని గంగదేవరాలయం, చిన్న కోరుకొండలోని భ్రమరాంబాలయం, పుల్లయ్య బంజరలోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.