క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సండ్ర పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేసిందన్నారు.
ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త