ఖమ్మం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో నగరంలోని ఓ కార్పొరేటర్ గెస్ట్‌హౌస్‌లో రహస్య భేటీ నిర్వహించారు. నగర మేయర్ పాపాలాల్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు సమావేశ కావటం చర్చనీయాంశంగా మారింది. మేయర్‌ను మార్చేందుకు కార్పోరేటర్లు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కార్పొరేటర్లు అందరూ ఏకమై మేయర్ మార్చేందుకు అవసరమైతే అధినేతను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ