ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చింతలపాటి వీధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెరాస ఎన్నికల గుర్తు, సేవ్గర్ల్, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే ముగ్గు, కేసీఆర్ చిత్రపటంతో వేసిన ముగ్గులు అలరించాయి. అనంతరం విద్యార్థులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి : ఒక దొంగ.. 31 బైకుల చోరీ..